గేమింగ్ బ్రాండ్ రేజర్ నుంచి సెకెండ్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్

గేమింగ్ బ్రాండ్ రేజర్ వచ్చే నెల 10న సెకెండ్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన రేజర్ ఫోన్‌కు ఇది సక్సెసర్. ఈ మేరకు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపింది. అయితే, ఈ ఫోన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే అక్టోబరు 9న గూగుల్ తన పిక్సల్ ఫోన్లను విడుదల చేయనుండడం విశేషం. రేజర్ సెకెండ్ జనరేషన్ ఫోన్ ధర వివరాలు బయటకు రానప్పటికీ దాదాపు రూ.50,800 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్పెసిఫికేషన్లు: 5.72 అంగుళాల ఐజీజడ్ఓ ఎల్‌సీడీ అల్ట్రా మోషన్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 2 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే వెనకవైపు 12 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సల్ ఫిక్స్‌డ్ ఫోకస్ కెమెరా సెన్సార్ ఉన్న ఈ ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించినట్టు లీకైన వివరాలను బట్టి తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*