
విజయవాడ: వైసీపీలో వంగవీటి రాధ వివాదం ముదిరింది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అధిష్టానం వెనక్కి తగ్గలేదు. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇంఛార్జ్‌గా మల్లాది విష్ణుకు బాధ్యతలు అప్పగించింది. విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో రాధకు మచిలీపట్నం లోక్‌సభ లేదా విజయవాడ తూర్పు స్థానాలను మాత్రమే వైసీపీ అధిష్టానం ఆప్షన్‌గా పెట్టినట్లు సమాచారం.
వైసీపీ అధిష్టానం టచ్ లోకి రాకుండా ఝలక్ ఇవ్వడంతో వంగవీటి రాధా కార్యాలయానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రాధా రంగా మిత్ర మండలి, అభిమానులు, వైసీపీ కార్పొరేటర్లతో, సన్నిహితులతో రాధ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. కాసేపట్లో రాధ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Be the first to comment