హైదరాబాద్‌లో కుమార్తెను నరికేసిన తండ్రి

మిర్యాలగూడ ప్రణయ్-అమృత ఘటన జరిగి వారం కూడా కాలేదు.. ఇంతలోనే మరో ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న  కారణంతో కుమార్తెను తండ్రి దారుణంగా నరికిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల సందీప్ (21), బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి(20) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 10 రోజుల కిందట వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత ఇద్దరూ తమకు ప్రాణహాని ఉందని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో మాధవి తండ్రి మనోహరాచారి మరింత రగిలిపోయాడు.

కుమార్తెను, అల్లుడిని మాట్లాడుకుందాం రమ్మని ఎర్రగడ్డలోని ఓ షోరూం వద్దకు పిలిపించాడు. సందీప్, మాధవి స్కూటర్‌పై అక్కడి చేరుకున్నారు. మాధవి తండ్రి మరో బైక్ పై అక్కడికి చేరుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న బ్యాగులో కొబ్బరి బోండాలు నరికే కత్తి తెచ్చుకున్నాడు. తొలుత సందీప్‌పై వేటేశాడు. ఆ తర్వాత అదే కత్తితో కుమార్తెను అర నిమిషంలో నాలుగు సార్లు నరికాడు.

తీవ్ర రక్తస్రావంతో మాధవి రోడ్డుపై కుప్పకూలిపోయింది. దాడి సమయంలో అక్కడే ఉన్న వారిలో ఒకరిద్దరు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే చారి చేతిలో కత్తి ఉండటంతో భయపడ్డారు. దాడి అనంతరం చారి పారిపోగా గాయాలపాలైన సందీప్, మాధవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది. పంజాగుట్ట ఏసీీపీ విజయ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో ఉన్న చారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తన పరువు తీసినందుకే నరికేశానని చారి చెప్పాడు. దాడి సమయంలో చారి మద్యం తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. తన భార్య, కుమారుడు కూడా మాధవికి సహకరించడాన్ని చారి జీర్ణించుకోలేకపోయాడు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*