ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రాంచీ: పది కోట్ల పేద కుటుంబాలకు లబ్ది చేకూర్చే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని మోదీ నేడు రాంచీలో ప్రారంభించనున్నారు. 2018-19 బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తారు. 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందిస్తారు. మోదీ కేర్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ పథకానికి కేంద్రం ఇప్పటికే 12వందల కోట్ల రూపాయలను కేటాయించింది.

రాంచీలో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారంటూ జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్విటర్ ద్వారా తెలిపారు.

మొత్తం 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవచ్చునని తెలుస్తోంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*