ఆ పోస్టులపై మనోజ్ సీరియస్.. అమృత వార్నింగ్..

నల్గొండ, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనను అవమానించేలా పోస్టులు వస్తున్నాయని మండిపడ్డారు ప్రణయ్ భార్య అమృత. ప్రణయ్ హత్యను సమర్థిస్తూ, తన తండ్రి మారుతీరావును సమర్థిస్తూ పోస్టులు రావడంపై ఆమె కన్నెర్ర చేశారు. తన అత్తమామలను కూడా టార్గెట్ చేస్తున్నారని ఇలాంటి పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడతానని హెచ్చరించారు.

ప్రణయ్‌ను అమృత తండ్రి చంపించాక రాజకీయ పార్టీల నేతలు అమృతకు బాసటగా నిలిచారు. అమృతకు ప్రభుత్వం ఎనిమిదన్నర లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించింది. అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెడ్‌రూం, స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది.

అటు మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత తలపోస్తున్నారు. దీనికి రాజకీయ పార్టీల నేతలు మద్దతిచ్చారు.

మరోవైపు ప్రణయ్ హత్యను సమర్థిస్తూ సోషల్ మీడియా పోస్టులు వస్తుండటంపై మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మారుతీరావును సమర్థించేవారంతా కుక్కలని మనోజ్ సంభోదించారు. అమృతకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*