నిమజ్జనానికి హైటెక్ పద్ధతిలో ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణలో వినాయక నిమజ్జనానికి హైటెక్ పద్ధతిలో ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాలోని వినాయక మంటపాలను, నిమజ్జన ప్రక్రియను డీజీపీ కార్యాలయం నుంచి లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ జిల్లాల్లో చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు.

అనుమానాస్పద వ్యకులను గుర్తించేందుకు ఫేషియల్ రేకగ్నై‌స్‌డ్ కెమెరాలను ఏర్పాటు చేశామని డీజీపీ చెప్పారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. 65వేలమంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని మహేందర్ రెడ్డి చెప్పారు.

సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. మహిళలను, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దించామని తెలిపారు. సున్నిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టామని డీజీపీ చెప్పారు.

మరోవైపు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఏమన్నారంటే..!

 • గ‌ణేష్ నిమజ్జ‌న శోభ‌యాత్ర జ‌రిగే 370 కిలోమీట‌ర్ల మార్గంలో ప్ర‌తి మూడు కిలోమీట‌ర్ల‌కు ఒక గ‌ణేష్ యాక్ష‌న్ టీమ్‌ల ఏర్పాటు.
 • ఒక్కో టీమ్‌లో ఒక శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ లేదా శానిట‌రీ జ‌వాన్‌, ముగ్గురు ఎస్‌.ఎఫ్‌.ఏలు, 21మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా ప‌నిచేస్తారు.
 • మొత్తం 178 ఈ గ‌ణేష్ యాక్ష‌న్‌టీమ్‌ల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
 • పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌కు 481మంది సూప‌ర్‌వైజ‌ర్లు, 719 ఎస్‌.ఎఫ్‌.ఏలు, 8,597 పారిశుధ్య కార్మికుల‌ను నియ‌మించాం.
 • గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ద్వారా రూ.16.86 కోట్ల తో విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది.
 • నిమ‌జ్జ‌నం సాఫీగా జ‌ర‌గ‌డానికి 35 ప్రాంతాల్లో 117 స్టాటిక్ క్రేన్‌ల‌ను, 96 మొబైల్ క్రేన్‌ల ఏర్పాటు.
 • క్రేన్లు ఏర్పాటు నీటి పారుదల శాఖ ద్వారా కాకుండా ఈసారి జిహెచ్ఎంసి ద్వారా ఏర్పాటు చేస్తున్నాం.
 • ఇప్పటికే జిహెచ్ఎంసి ద్వారా నిర్మించిన 20 గణేష్ నిమజ్జన కొలనులలో శుభ్రమైన నీటిని నింపి నిమ‌జ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
 • భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఏమన్నారంటే..!
 • గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారులలో రోడ్ల రీ-కార్పెటింగ్‌, మరమ్మత్తులు, పూడ్చివేత తదితర పనులకు రూ. 10.52 కోట్లతో 169 పనులు మంజూరు చేయడం జరిగింది.
 • ఎస్ ఆర్ డి పి జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
 • నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమించడం జరుగుతుంది.
 • విద్యుత్ విభాగం ద్వారా 34,926 తాత్కాలిక లైట్లు రూ. 94. 21 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాం.
 • నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది.
 •  నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*