ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు దారుణ హత్య

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావును మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చారు. అరకు నియోజకవర్గం డుమ్రిగూడ మండలం తూటంగిలో ఘటన జరిగింది. దాడిలో అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా మృతి చెందారు. కిడారి సర్వేశ్వరరావుతో పాటు అనుచరుడ్ని కాల్చి చంపిన మావోయిస్టులు.

 

ఘటనాస్థలంలోనే ఎమ్మెల్యే కిడారి కన్నుమూశారు. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వస్తుండగా దాడి మావోయిస్టులు దాడి చేశారు. తన మైనింగ్ క్వారీ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారిపై కాల్పులు జరిగాయి. దాడిలో 50 వరకు మావోయిస్టులు పాల్గొన్నారు. దాడి చేసింది మహిళా మావోయిస్టుల దళమని సమాచారం.

 

అతి సమీపంలో నుంచి కిడారిపై మావోలు బుల్లెట్ల వర్షం కురిపించారు. కిడారి చాతిలో నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. పకడ్బందీగా మాటు వేసి మావోయిస్టులు దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మావోయిస్టుల దాడి జరిపారు. ఈయన వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి మారారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*