
మహబూబాబాద్: అక్రమ సంబంధం కారణంగా మేనల్లుడిని మేనమామ గొడ్డలితో నరికి చంపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురం శివారు కొత్త తండాలో చోటు చేసుకుంది. మాలోతు లింగన్న, మేనమామ భానోత్ భద్రు రైతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
భద్రు భార్యతో లింగన్న కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. లింగన్నను పద్ధతి మార్చుకోమని భద్రు చాలా సార్లు హెచ్చరించాడు. పెడచెవిన పెట్టి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
అదను కోసం ఎదురు చూసిన భద్రు వినాయక నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో లింగన్నను గొడ్డలితో నరికాడు. కొన ఊపిరితో ఉన్న లింగన్నను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Be the first to comment