అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌..

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి.

ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌రొకండ‌కు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వ‌ర్ష‌న్ లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.

మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్
నిర్మాత‌: కేఈ జ్ఞాన‌వేల్ రాజా
నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్
క‌థ‌: షాన్ క‌రుప్పుసామి
సంగీతం: స‌్యామ్ సిఎస్
సినిమాటోగ్ర‌ఫీ: శాంత‌న కృష్ణ‌ణ్
ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డిఆర్కే కిర‌ణ్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*