
హైదరాబాద్: భాగ్య నగరంలో పట్టపగలు మరో హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 145 వద్ద ఓ యువకుడిని వెంటాడి గొడ్డళ్లతో నరికారు. రక్షించాలంటూ యువకుడు పెట్టిన ఆర్తనాదాలు అందరికీ వినపడుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఒకరిద్దరు స్థానికులు అడ్డుకునేందుకు వెళ్లగా దుండగులు వారిని భయపెట్టారు. యువకుడిని నరికి చంపే దృశ్యాలను అక్కడ ఉండేవారు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఉండగానే, పోలీసులు చూస్తుండగానే దాడి జరగడం సంచలనం సృష్టించింది. దాడి అనంతరం ట్రాఫిక్ పోలీసులు దుండగుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు గల కారణాలపై దుండగులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో జనం భయపడిపోతున్నారు.
Be the first to comment