బీజేపీలోకి బాబుమోహన్.. ఆందోల్‌లో త్రిముఖ పోరు!

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఆ సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. బీజేపీ టికెట్ నుంచి ఆయన ఆంధోల్ నుంచి పోటీపడతారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దు తర్వాత ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల జాబితాలో బాబు మోహన్ పేరు లేదు. ఆంధోల్ నుంచి జర్నలిస్ట్ క్రాంతిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో బాబు మోహన్ నొచ్చుకున్నారు. చివరకు బీజేపీలో చేరి అందరికీ షాకిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ బరిలోకి దిగుతున్నారు. బాబూమోహన్ బీజేపీలో చేరడంతో ఆంధోల్‌లో త్రిముఖ పోటీ తప్పదని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*