
హైదరాబాద్: బిగ్ బాస్-2 విజేత ఎవరనేది ప్రకటించేశారు. ఫైనల్‌కు చేరిన ఐదుగురిలో సామ్రాట్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాని తొలుత ప్రకటించారు. దీప్తి కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మిగిలిన ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో దగ్గరకు పంపించి… అలారం మోగించారు. ఆ తర్వాత హౌస్‌లో ఇద్దరు మాత్రమే మిగిలారు. తనీశ్ స్టేజ్‌పై నాని పక్కకు వచ్చేశాడు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో కౌశల్‌ను విక్టరీ వెంకటేశ్ విజేతగా ప్రకటించారు. 50 లక్షల నగదును కౌశల్ గెలుచుకున్నారు. గీతా మాధురి రన్నరప్‌గా నిలిచారు.
Congratulations #Kaushal for winning #BiggBossTelugu2 .. Wishing you all the best for future endeavours ???? pic.twitter.com/Yb2Is5mHSj
— STAR MAA (@StarMaa) September 30, 2018
తనకు అందిన 50 లక్షల రూపాయల మొత్తాన్ని కేన్సర్ పేషంట్లకు ఇచ్చేస్తున్నానని కైశల్ ప్రకటించారు. తన తల్లి కేన్సర్‌తో చనిపోయారని కౌశల్ గుర్తు చేశారు.
అంతకు ముందు బిగ్ బాస్ టూ ముగింపు కార్యక్రమం సందడిగా సాగింది. పార్టిసిపెంట్స్ అందరూ కార్యక్రమానికి విచ్చేశారు.
Be the first to comment