
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. ఈ నెల 10న ప్రారంభం కానున్న ఈ సేల్ ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ సేల్‌గా చెబుతున్న ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అప్లయెన్సెస్‌తోపాటు మరెన్నో ఉత్పత్తులను భారీ రాయితీలతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఇందుకోసం సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తోంది. వీరిలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీతోపాటు మరెందరో ఉన్నారు.
మొదటిసారి ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి కోసం ప్లిప్‌కార్ట్ మరికొన్ని ఆఫర్లు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అలాగే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగానే సేల్ ప్రారంభం కానుంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్ కేటగిరీల వారీగా ఉండనుంది. తొలి రోజు ఫ్యాషన్, టీవీలు, అప్లయెన్సెస్, స్మార్ట్ డివైజ్లుపై ఆఫర్లు ఉండగా, రెండో రోజు స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై సేల్ నిర్వహించనుంది. అక్టోబరు 14 వరకు ఇలా ప్రతీ రోజు ప్రతీ వివిధ కేటగిరీల్లో సేల్ నిర్వహించనుంది. డిస్కౌంట్లతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు ఇవ్వనుంది. ఇందులో క్రేజీ డీల్స్, మహాప్రైస్ డ్రాప్, రష్ అవర్, ఫ్లాష్ సేల్ పేరుతో నాలుగు రకాలు ఉన్నాయి.
మొబైల్స్‌పై పలు ఆఫర్లు ప్రకటించనున్న ఫ్లిప్‌కార్ట్.. కొన్ని డీల్స్‌ను 3 నుంచి 7 మధ్య బయటపెట్టనుంది. టీవీలు, అప్లయెన్సెలపై 80 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే, 500 బ్రాండ్లు, 38 వేలకు పైగా ఉత్పత్తులను సేల్‌లో ఉంచనుంది. వీటిలో చాలా వరకు ఉత్పత్తులకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇవ్వనుంది. ఎలక్ట్రానిక్ వస్తువులపైనా 80 శాతం రాయితీ ఇవ్వనుంది. ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, సౌండర్‌లు, డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్లు తదితర వాటిపై భారీ రాయితీలు ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
Be the first to comment