12 గంటల్లో 50 లక్షల మంది చూసేశారు..

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత ట్రైలర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. 12 గంటల్లోనే 50 లక్షల మంది చూసేశారు. సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. హారిక, హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు.

12 గంటల్లోనే 50 లక్షల మంది చూసేశారంటూ హారిక హాసినీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది.

అరవింద సమేతలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

అక్టోబర్ 11న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*