
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ పేరు మార్మోగిపోతోంది. బిగ్‌బాస్ -2లో విజేతగా నిలిచిన కౌశల్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడా? అవుననే అంటోంది కౌశల్ ఆర్మీ. కౌశల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా అతడి విజయం కోసం పరితపించిన ఆయన అభిమానులు ఇప్పుడు కౌశల్‌తో కలిసి సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. బిగ్‌బాస్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని విజేతగా బయటకొచ్చిన కౌశల్‌కు ఇప్పుడు స్టార్ ఫాలోయింగ్ ఉంది. యువతకు ఆయనో రోల్ మోడల్‌గా మారాడు.
ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తుండగా, తాజాగా కౌశల్ ఆర్మీ పేరుతో ఏర్పడిన ఆయన అభిమానులే ఏకంగా నిర్మాతలుగా మారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అందరూ కలిసి నాలుగు కోట్ల రూపాయలు సమకూర్చి కౌశల్ హీరోగా సినిమా తీయనున్నట్టు సమాచారం. కౌశల్ ఇప్పటికే పలు సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ నటించాడు. యాడ్ ఏజెన్సీ ఉండనే ఉంది. ఇప్పుడీ అనుభవాన్ని రంగరించి సోలో హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని ఆయన అభిమానులు పట్టుదలగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Be the first to comment