ఉత్తమ్ కుమార్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిప్పులు చెరిగారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని పట్టుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టేబాజ్ గాడు అన్నారని, అలా అనొచ్చా? అని ప్రశ్నించారు. ఎవరు బట్టేబాజ్ గాడో మీరు ఓటు ద్వారా చెప్పాలని ప్రజలను కోరారు.

ఎవరి ప్రవర్తన ఏమిటో మీ కళ్లముందే ఉందన్న కేసీఆర్ ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తన నోరు చాలా చెడ్డదని, తెరిస్తే తెల్లారేదాక తిడుతూనే ఉంటానని అన్నారు. అయితే, ఓ ముఖ్యమంత్రిగా గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నాను కాబట్టి నోరు కట్టుకుని ఉంటున్నానని కేసీఆర్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*