సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా?: కేసీఆర్

నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నాశనం చేసిన చంద్రబాబు వంటి వ్యక్తితో సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? ఇదా మీ బతుకు’’ అని ధ్వజమెత్తారు. అడుక్కుంటే తాము నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమని, పోయిపోయి మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతమంది చచ్చిపోయింది ఇదుకేనా? చావు దగ్గరికి పోయి తెలంగాణ తెచ్చింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని తెలంగాణను అమరావతికి తాకట్టుపెడతారా? అని నిలదీశారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తీసుకురావాలని చంద్రబాబు కుట్రలు పన్నారని కేసీఆర్ ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*