సైకిలుపై తిరిగిన కన్నాకు విదేశాల్లో కంపెనీలు ఎక్కడివి?: బుద్దా వెంకన్న

సైకిల్‌పై తిరిగిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు విదేశాల్లో కంపెనీలు ఎక్కడివని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అక్రమాస్తులు కాపాడుకోవడానికే ఆయన బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూపాయికే ఎకరం భూమి కేటాయించారని ఆరోపించారు. ఆయన ఓ జేబులో బీజేపీ జెండా, మరో జేబులో వైసీపీ జెండా పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

2014లో కన్నా జైలుకెళ్లకుండా తప్పించుకున్నారని, 2019లో మాత్రం తప్పదని జోస్యం బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ రాష్ట్రానికి పట్టిన శని అని, వెకిలి చేష్టల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ పొలిటికల్ డిప్రెషన్‌లో ఉన్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*