హృదయాలను టచ్ చేసిన తారక్, కళ్యాణ్‌ రామ్ సందేశాలు

నందమూరి తారకరామారావు తన ఎమోషనల్ స్పీచ్‌తో ఫ్యాన్స్ హృదయాలను టచ్ చేశారు. అరవింద సమేత ప్రి రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రికి ఇచ్చిన మాటే మీకూ ఇస్తున్నానంటూ తన జీవితం అభిమానులకే అంకితమని చెప్పారు. తన 28వ చిత్రంలో తండ్రి చితికి నిప్పంటించే సీన్ ఉండటం యాదృచ్ఛికమేమో అంటూ నెల క్రితం తన తండ్రిని కోల్పోయిన సంగతిని కన్నీళ్ల మధ్య గుర్తు చేసుకున్నారు.

తన తండ్రి చనిపోయినప్పటి నుంచీ తనను ఓదారుస్తూ, తనకు అండగా నిలబడ్డారంటూ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు తారక్ ధన్యవాదాలు తెలిపారు.

తన తండ్రి చనిపోయిన ఐదు రోజులకే అరవింద సమేత సినిమా షూటింగ్‌కు వెళ్లడానికి ప్రధాన కారణం తన తండ్రి చెప్పిన మాటేనని అంతకు ముందు కళ్యాణ్ రామ్ గుర్తు చేశారు. వృత్తి ధర్మాన్ని పాటించాలని, నిర్మాతను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలంటూ తన తండ్రి హరికృష్ణ చెప్పిన విషయాలను కళ్యాణ్‌రామ్ గుర్తు చేశారు. కళ్యాణ్‌రామ్ స్పీచ్ సమయంలో తారక్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ నిజజీవితంలో చేసిన త్యాగాలను గుర్తు చేశారు. హరికృష్ణ జీవిత కాలం అన్న ఎన్టీఆర్‌కు అంకితమయ్యారని  గుర్తు చేశారు. తాత నందమూరి తారక రామారావు షూటింగ్‌లో ఉండగా కుమారుడు చనిపోయిన వార్త తెలిసి కూడా షూటింగ్ పూర్తి చేసి వెళ్లారని, వృత్తి ధర్మం పాటించారని, నిర్మాతను నష్టపరచవద్దని షూటింగ్ అయ్యాకే అంత్యక్రియలకు హాజరయ్యారని కళ్యాణ్ రామ్ గుర్తు చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*