బంజారాహిల్స్ స్పా సెంటర్ సీజ్.. పట్టుబడిన యువతిపై ఎస్‌ఐ లైంగిక దాడి?

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరుగురు యువకులను, వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. అనంతరం బంజారా హిల్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. స్పా సెంటర్‌ను సీజ్ చేశారు.

ప్రధాన నిర్వాహకుడు సతీష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు.

మరోవైపు తనపై టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ లైంగిక దాడి జరిపాడని పట్టుబడిన యువతి ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో ఈ ఆరోపణలు అవాస్తవమని అధికారులు కొట్టిపారేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*