
విజయవాడ: ఏపీ రాజధాని విజయవాడ నగరంలో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. లబ్బీపేటలోని సదరన్ డెవలపర్స్, బెంజి సర్కిల్లోని విఎస్ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వేకోచ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు నిర్వహిస్తోంది. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్ట్ పనులను సదరన్ డెవలపర్స్ నిర్వహించినట్లు సమాచారం అందింది.
నగరంలోని ఆటోనగర్ ఐటి జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మొత్తం పది బృందాలుగా ఐటీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సోదాలు మొదలయ్యాయి. సదరన్ కన్స్ట్రక్షన్ కంపనీ ఆఫీసు సిబ్బంది ఇళ్లలో కూడా ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విలువైన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ సిబ్బందిని బయట ఉండాలని అదేశించారు. తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Be the first to comment