ఏపీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ నియామకంపై హైకోర్టులో పిటీషన్

హైదరాబాద్: కారెం శివాజీ ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది ప్రసాద్ బాబు పిటీషన్ దాఖలు చేశారు. గతంలో కారెం శివాజీ ఎంపిక చెల్లదని హైకోర్టు దర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించి తిరిగి నియమించడంపై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు.

కమిషన్ చైర్మన్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మాల మహానాడుకు అధ్యక్షుడుగా పని చేసిన కారణంగా అన్ని కులాలకు సమన్యాయం చేయలేడని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్ట్‌లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కారెం శివాజీ నియామకం ప్రక్రియ రికార్డులను సమర్పించాలని హైకోర్టు  ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 31న నేరుగా హాజరు కావాలని కారెం శివాజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*