రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. లక్ష్మీనారాయణ చేప్టటిన 13 జిల్లాల పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పులు అవసరమని పేర్కొన్న ఆయన కొత్త తరానికి చోటివ్వాలని అన్నారు. డబ్బు, కులమత, ప్రాంతాలతో ముడిపడిన రాజకీయాలకు ఇకపై చోటుండకూడదన్నారు.

తాను రాజకీయాల్లో వస్తున్నానని పునరుద్ఘాటించిన లక్ష్మీనారాయణ.. జీరో బడ్జెట్ రాజకీయమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే తన ఖర్చు ఉంటుందని, ఓటు వేయాలంటూ తానెవరికీ డబ్బు ఇవ్వనని స్పష్టం చేశారు.

గ్రామాల్లో పర్యటించిన తాను పరిశీలించిన సమస్యలను పరిష్కరించగలిగే శక్తి ఒక్క రాజకీయాలకే ఉందని, ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లకు అంత శక్తి లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తన ఆలోచనలను పంచుకుని, వాటిని అనుసరించే పార్టీలతో కలిసి ముందుకెళ్తానని లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. లేదంటే ప్రత్యామ్నాయం గురించి అప్పుడు ఆలోచిస్తానన్నారు. ఈ విషయంలో త్వరలోనే ప్రకటన చేస్తానని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*