ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ… డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్

ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. నాలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ తెలిపారు.

తెలంగాణ, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 12న నోటిఫికేషన్‌
ఒకే దశలో తెలంగాణలో పోలింగ్
డిసెంబర్‌ 7న తెలంగాణ, రాజస్థాన్‌లో పోలింగ్
డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు
నవంబర్‌ 19 నామినేషన్లకు చివరి తేదీ
నవంబర్‌ 20న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22

అరకు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక లేదు: రావత్
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఎన్నికలు లేవు: రావత్‌

రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 12, 20 తేదీల్లో పోలింగ్
మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్
మధ్యప్రదేశ్‌, మిజోరంలో నవంబర్‌ 28న పోలింగ్‌
డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు

రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు
అక్టోబర్‌ 16న తొలి విడత నోటిఫికేషన్‌
నామినేషన్లకు అక్టోబర్‌ 23 చివరి గడువు
24న స్క్రూటినీ, 26న ఉపసంహరణ, నవంబర్‌ 12న పోలింగ్
అక్టోబర్‌ 26న ఛత్తీస్‌గడ్‌ ఎన్నికల రెండో విడత నోటిఫికేషన్‌
నామినేషన్లకు నవంబర్‌ 2 చివరి తేదీ
నవంబర్‌ 5న ఉపసంహరణ, 20న పోలింగ్‌
మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్
నవంబర్‌ 2న నోటిఫికేషన్‌ విడుదల
నామినేషన్లకు నవంబర్‌ 9 చివరి తేదీ
12న స్క్రూటినీ, 14న విత్‌డ్రా, నవంబర్‌ 28న పోలింగ్‌

ఈసీ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*