
ముందస్తు ఎన్నికలంటూ హడావిడి చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఎన్నికలకు 9 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. నవంబరులో ఎన్నికలు జరిగితే, డిసెంబరులో తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు కూడా.
అయితే, ఆయన ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా ముందుకు రానున్న ఎన్నికల సంఘం తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో కేసు ఉండడంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తెలంగాణను మినహాయించి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హైకోర్టులో కేసు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.
Be the first to comment