గుండెలు పిండే ఘటన! రైలు కింద పడి మాజీ జడ్జి ఆత్మహత్య.. భరించలేక భార్య కూడా అక్కడే..

అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జడ్జి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిన భార్య తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే రైలు కిందే పడి ఆత్మహత్య చేసుకుంది. తిరుపతిలోని తిరుచానూరులో జరిగిందీ విషాద ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..

తిరుచానూరుకు చెందిన పామూరు సుధాకర్‌ (63)- భార్య వరలక్ష్మి (56) దంపతులు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన సుధాకర్ 2014లో రిటైరయ్యారు. వీరికి సందీప్, అజిత అనే ఇద్దరు సంతానం. వీరిద్దరికీ వివాహమైంది.

సుధాకర్ గత కొంతకాలంగా కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీంతో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న ఆయన ఆత్మహత్య చేసుకుని తనవు చాలించాలని భావించారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో చదలవాడ విద్యాసంస్థల సమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుధాకర్‌ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య వరలక్ష్మి కుటుంబ సభ్యుల దృష్టి మరల్చి భర్త ఆత్మహత్య చేసుకున్న చోటే అదే రోజు సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడిచిన వరలక్ష్మి మరణంలోనూ భర్త అడుగుజాడల్లోనే నడవడం అందరి హృదయాలను పిండేసింది. విషయం తెలిసి తిరుచానూరు మొత్తం కన్నీరు పెట్టుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*