అశ్విన్ మాయాజాలం… తక్కువ పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

రాజ్‌కోట్ టెస్ట్: భారత్‌తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్‌లో మూడోరోజు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌‌మెన్ చేతులెత్తేశారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో రోస్టన్ ఛేస్ 53, పాల్ 47 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, షమీ 2 వికెట్లు, ఉమేశ్, జడేజా, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు.

భారత్ తమ తొలి ఇన్నింగ్స్ 649/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో పృథ్వీ షా 134 పరుగులు చేశారు. తొలి టెస్ట్‌లోనే సెంచరీ బాది పృథ్వీ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. రంజీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా సెంచరీలు కొట్టాడు. పుజారా 86, కోహ్లీ 139, రహానె 41, రిషభ్‌ పంత్‌ 92, జడేజా (నాటౌట్‌) 100, అశ్విన్‌ 7, కుల్దీప్‌ యాదవ్‌ 12, ఉమేశ్‌ యాదవ్‌ 22, షమి (నాటౌట్‌) 2 పరుగులు చేశారు.

అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి భారత్ తడాఖా చూపింది. మరోవైపు వెస్టిండీస్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమై ఘోర పరాజయాన్ని మూట కట్టుకోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*