
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటే అంతెత్తున ఎగిరిపడే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ప్రశంసల్లో ముంచెత్తారు. మంత్రి నారా లోకేశ్ కంటే చంద్రబాబు ఎన్నో రెట్లు ప్రతిభావంతుడని కొనియాడారు. అయితే, అంతలోనే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నందమూరి అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు విపరీతమైన క్రేజ్ ఉందన్న ఆమె.. లోకేశ్ కోసం ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్ వస్తే లోకేశ్‌కు ఎక్కడ స్థానం దక్కదో అనే భయం చంద్రబాబులో ఉందన్నారు.
లోకేశ్‌కు పోటీ వస్తాడన్న ఆలోచనతోనే ఎన్టీఆర్‌ను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. నటుడిగా, వక్తగా ఎన్టీఆర్ తనని తాను నిరూపించుకున్నాడని అన్నారు. ఎన్టీఆర్‌కు కనుక పార్టీలో ఏదైన పదవి ఇస్తే టీడీపీ నేతలంతా అతడికి మద్దతిచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, అలా జరుగుతుందని మాత్రం తాను భావించడం లేదన్నారు.
Be the first to comment