ఆ సీరియళ్లలో నీతి జాతి లేదు.. మండిపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి

టీవీ సీరియల్స్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వీటి వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదన్నారు. వీటి వల్ల ప్రయోజనం ఏముందో చెప్పాలని మహిళలను ప్రశ్నించారు. తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి షాదీఖానాలో జరిగిన దుల్హన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సమావేశానికి హాజరైన మహిళలను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతున్న సీరియళ్లలో నీతి అనేది కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంపాదన కోసమే సీరియళ్లు తీస్తున్నారని అన్నారు. కుటుంబాల్లో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలను సీరియళ్లు రెచ్చగొడుతున్నాయన్నారు. మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు సీరియళ్లు తిలోదకాలు ఇస్తున్నాయని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం దుల్హన్ పథకం గురించి మాట్లాడుతూ.. ఈ పథకం కింద వచ్చే రూ. 50 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలని, లేదంటే, స్వయం ఉపాధి కోసం వినియోగించాలని సూచించారు. మహిళలు చదువుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*