విశాఖలో మూర్తి అంతిమయాత్ర.. నివాళులర్పించిన చంద్రబాబు

విశాఖ: అమెరికా అలాస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం విశాఖ చేరుకుంది. మూర్తి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలు పార్టీలకు చెందిన నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

సీఎం చంద్రబాబు మూర్తి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మూర్తి కుటుంబసభ్యులను ఓదార్చారు. మూర్తి చేసిన సేవలను కొనియాడారు. మూర్తి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. భారీ ర్యాలీగా మూర్తి అంతిమయాత్ర కొనసాగుతోంది.

అంతకు ముందు మంత్రులు నారా లోకేశ్, గంటా, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్ మూర్తి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి కూడా మూర్తి పార్ధీవదేహం వద్ద నివాళులర్పించారు.

మధ్యాహ్నం 2గంటల వరకు మూర్తి స్వగృహంలో భౌతికకాయం ఉంచుతారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 2.45వరకు ఎన్టీఆర్‌ భవన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత రుషికొండ గీతం వర్సిటీ వరకూ అంతిమయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత రుషికొండ స్మృతివనంలో ఎంవీవీఎస్‌ మూర్తి అంత్యక్రియలు జరుగుతాయి. పూర్తి అధికారిక లాంఛనాలతో మూర్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*