
పడిపడి లేచే మనసు సినిమా టీజర్ విడుదలైంది. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. కోల్ కత్తా, నేపాల్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు హను. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతుంది. షూటింగ్ చివరిదశలో ఉంది పడిపడి లేచే మనసు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్ కానుంది. వీళ్ల కెమిస్ట్రీ ఫస్ట్ లుక్ లోనే అద్భుతంగా వర్కవుట్ అయింది. దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ పడిపడి లేచే మనసుకు మరో హైలైట్.
Arriving this #Christmas [21 Dec 2018]… Teaser of #Telugu film #PadiPadiLecheManasu… Stars Sharwanand and Sai Pallavi… Directed by Hanu Raghavapudi… #PPLMTeaser [with English subtitles]: https://t.co/AQSvFcw8WR pic.twitter.com/ud7JezAjX7
— taran adarsh (@taran_adarsh) October 10, 2018
విశాల్ చంద్రశేఖర్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పడిపడి లేచే మనసు విడుదల కానుంది.
#PadiPadiLecheManasu teaser, a breezy love story from an epic city, the city of Joy #Kolkata on Dec21St#PPLMhttps://t.co/2k2L4KM6yw
— hanu (@hanurpudi) October 10, 2018
నటీనటులు:
శర్వానంద్, సాయిలప్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫర్: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: A శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
పిఆర్ఓ: వంశీ శేఖర్
This post is also available in : English
Be the first to comment