
పడిపడి లేచే మనసు సినిమా టీజర్ ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. కోల్ కత్తా, నేపాల్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు హను.
ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతుంది. షూటింగ్ చివరిదశలో ఉంది పడిపడి లేచే మనసు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
After successfully finishing the shoot in Kolkata(the Epic city), I’m eagerly waiting for the Nepal schedule to commence. Thrilled to announce that We are bringing the film to you on the 21st of Dec. pic.twitter.com/nYExsmtKXf
— hanu (@hanurpudi) July 25, 2018
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్ కానుంది. వీళ్ల కెమిస్ట్రీ ఫస్ట్ లుక్ లోనే అద్భుతంగా వర్కవుట్ అయింది.
#PadiPadiLecheManasu Looking forward to bring the teaser out soon. EXCITED to present the film even I’m sad the shoot is coming to a close. pic.twitter.com/4Wf77zLspS
— hanu (@hanurpudi) October 8, 2018
దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ పడిపడి లేచే మనసుకు మరో హైలైట్. విశాల్ చంద్రశేఖర్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పడిపడి లేచే మనసు విడుదల కానుంది.
నటీనటులు:
శర్వానంద్, సాయిలప్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫర్: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: A శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
పిఆర్ఓ: వంశీ శేఖర్
This post is also available in : English
Be the first to comment