బెజవాడ దుర్గమ్మ ఆలయం తలుపులు తెరిచే అరుదైన దృశ్యం

విజయవాడ: అఖిలాండకోట బ్రహ్మాండనాయకి జ‌గ‌జ్జ‌నని.. ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్స‌వాల్లో తొలి రోజైన‌ ఈ రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.

తెల్లవారుజామునే అమ్మవారి ఆలయంలో అర్చకస్వాములు స్నపనాభిషేకం వంటి వేదోక్తమైన పూజాదికాలు నిర్వహించి ఉదయం 9 గంటలకు అమ్మవారి గర్భాలయ తలుపులను తెరచి అమ్మ వారి దివ్య దర్శన భాగ్యం కల్పించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి దుర్గమ్మ అమ్మవారి అరుదైన రూపం స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిని దర్శనం చేసుకుని తరిస్తున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*