సీఎం రమేష్‌ నివాసాలు, వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు.. భయపడబోమన్న లోకేశ్..

అమరావతి: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌ నివాసం, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.

ఏకకాలంలో 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

సీఎం రమేష్‌ కేంద్ర పీఏసీ సభ్యుడిగా కూడా ఉన్నారు. దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు? ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఆయన పీఏసీ సభ్యుడిగా ఐటీశాఖకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.

కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు చేస్తోందంటూ టీడీపీ ఆరోపించింది.

 

ఐటీ దాడులపై  ట్విటర్‌లో స్పందించిన నారా లోకేశ్ మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.

హోదాతో పాటు హామీలు నెరవేర్చమన్నందుకు తమ నేతలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

కేంద్రం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము వెనక్కు తగ్గబోమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేశ్ ఆమరణ దీక్ష చేసి నేటికి వందో రోజు. కేంద్ర ఉక్కుశాఖమంత్రిని నేడు టీడీపీ ఎంపీలు కలవనున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*