ఉమేశ్ యాదవ్ జాదూ…. ఆరు వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచాడు…

హైదరాబాద్: భారత్‌ వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్ట్ రెండో రోజు వెస్టిండీస్ జట్టు 311 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ 88 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో చేజ్ 106 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో హోల్డర్ 52, బ్రాత్‌వైట్ 14, పోవెల్ 22, హోప్ 36, డౌరిచ్ 30 పరుగులు చేశారు.

మరోవైపు గాయాల కారణంగా నేటి మ్యాచ్‌లో శార్దూల్ ఆడటం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకు ముందు వెస్టిండీస్ కోచ్ మాట్లాడుతూ తమ జట్టు 350 నుంచి 400 పరుగులు చేయగలుగుతుందని అంచనా వేశారు. అయితే వెస్టిండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ ఆ లక్ష్యానికి చేరుకోలేకపోయారు. ఉమేశ్ యాదవ్ వారిని కట్టడి చేశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.

అటు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది.  కేఎల్ రాహుల్, పృధ్వీ షా క్రీజులో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*