కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చేసిన గద్దర్.. రాహుల్‌తో భేటీ

న్యూఢిల్లీ: ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వచ్చిన ప్రచారానికి తెరపడింది. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని గద్దర్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కితో కలిసి గద్దర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారు. తనపై గతంలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలని గద్దర్ రాహుల్‌ను కోరారు. తెలంగాణాలో అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని గద్దర్ తెలిపారు.

కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గద్దర్ ఆరోపించారు. మరోవైపు గద్దర్ తనయుడు సూర్య కిరణ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*