మోదీకి లేఖ రాసిన చంద్రబాబు.. లెటర్‌లో ఏముందంటే?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిత్లీ తుపాను కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 2,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.

వ్యవసాయ రంగానికి రూ. 800 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 500 కోట్లు, రోడ్లకు సంబంధించి రూ. 100 కోట్లు, పంచాయితీరాజ్‌కు రూ.100 కోట్లు, హార్టీకల్చర్‌కు వెయ్యికోట్లు, పశుసంవర్దక శాఖకు రూ.50 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.100 కోట్ల నష్టం సంబంధించిందని చంద్రబాబు తమ లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద 1200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు నిన్న తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. పరిస్థితిని సమీక్షించారు. శ్రీకాకుళం గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్త‌రాంధ్ర‌ను అతలాకుత‌లం చేసిన‌ తిత్లీ తుపాను ప్ర‌భావం నుంచి ప్ర‌జ‌ల‌ను పూర్తిగా ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. చంద్ర‌బాబు తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. జిల్లా అధికారులు, ప్ర‌త్యేక అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. తుపాను ప్ర‌భావానికి గురై విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన ప్రాంతాల‌కు యుద్ద ప్రాతిప‌దిక‌న విద్యుత్ స‌ర‌ఫ‌రాను తిరిగి అందించేందుకు పెద్ద ఎత్తున బృందాలను రంగంలోకి దింపారు. జాతీయ ర‌హ‌దారుల‌పై విరిగిప‌డిన చెట్ల‌ను ఇప్ప‌టికే తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హెలికాప్ట‌ర్‌లో ఏరియ‌ల్‌స‌ర్వే చేసి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు.

వాస్తవానికి తిత్లీ తుపాను బీభత్సంపై ప్రధాని మోదీ చంద్రబాబుతో మాట్లాడారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని సమాచారం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*