
కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ ప్రథమార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారును పూర్తిచేసి చిత్రాన్ని ప్రేక్షకు ల ముందుకు తీసుకొస్తాం. ప్రామిసింగ్ చిత్రాల కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.నవంబరు ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు.
#IdamJagath #IdamJagathTeaser Thank you!https://t.co/4uoHBUMLYp pic.twitter.com/p0tbHMKcP4
— Sumanth (@iSumanth) August 25, 2018
శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్
.@iSumanth' #IdamJagath has completed its post-production works. Makers are aiming to release in November @ViraatFilms pic.twitter.com/2d4taw2faI
— BARaju (@baraju_SuperHit) October 12, 2018
Be the first to comment