‘‘వినరా సోదర వీరకుమారా!’’ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీరకుమారా!’. ఈ చిత్ర ఫస్ట్ ‌లుక్‌ను డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వినరా సోదర వీరకుమారా! చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. దర్శకుడు సతీష్‌కి మొదటి సినిమా ఇది. కథ మొత్తం నాకు చెప్పాడు. చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడు యూత్‌కి కావాల్సిన సినిమా. సతీష్ ఈ చిత్రాన్ని ట్రీట్ చేసిన విధానం నాకు ఎంతగానో నచ్చింది. ఆయన కథ చెబుతుంటే నాకు సినిమా మొత్తం కనిపించింది. అంత చక్కగా కథ చెప్పాడు. డైరెక్టర్ సతీష్, నిర్మాత లక్ష్మణ్, హీరో శ్రీనివాస్ సాయి.. ఇంకా చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ..‘‘ముందుగా మా చిత్ర ఫస్ట్ ‌లుక్‌ని విడుదల చేసిన పూరీగారికి మా చిత్ర యూనిట్ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. మా దర్శకుడు సతీష్ చంద్ర అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఫస్ట్ కాపీ రెడీ అయింది. మొత్తం ఇందులో ఐదు పాటలుంటాయి. శ్రవణ్ భరద్వాజ్ మంచి పాటలు ఇచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..’’ అన్నారు.

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: రవి. వి, మాటలు-పాటలు: లక్ష్మీ భూపాల, ఎడిటింగ్: మార్తండ్. కె. వెంకటేష్, ఫైట్స్: రాబిన్ సుబ్బు, డ్యాన్స్: అజయ్ సాయి, ఆర్ట్: లక్ష్మీ సింధూజ గ్రంథి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనీల్ మైలాపురం, నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ళ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*