పృధ్వీ షా, పంత్, శార్దూల్‌, ఉమేశ్‌లపై కోహ్లీ ప్రశంసల జల్లు

హైదరాబాద్: భారత్‌- వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌మ్యాచ్‌ మూడోరోజే ఫలితం తేలిపోయింది. వెస్టిండీస్‌ను భారత్ 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండానే 16.1 ఓవర్లలో 75 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని చేరుకుంది. పృధ్వీ షా 33, కేఎల్ రాహుల్ 33 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

అంతకుముందు వెస్టిండీస్ తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే తడబడింది. బ్రాత్‌వైట్, పోవెల్ డకౌట్ అయ్యారు. హోప్ 28, హెట్‌మైర్ 17, ఆంబ్రిస్ 38, హోల్డర్ 19, చేజ్ ఆరు పరుగులు చేసి అవుటయ్యారు.127 పరుగులకే వెస్టిండీస్ ఆల్‌ అవుట్ అయింది.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్ 2, కుల్దీప్ యాదవ్ 1, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు.

వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో చేజ్ 106 పరుగులు చేశాడు. హోల్డర్ 52, బ్రాత్‌వైట్ 14, పోవెల్ 22, హోప్ 36, డౌరిచ్ 30 పరుగులు చేశారు.

భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ 88 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ 4, పృధ్వీ షా 70, పుజారా 10, విరాట్ కోహ్లీ 45, రహానే 80, పంత్ 92, అశ్విన్ 35, కుల్దీప్ యాదవ్ 6 పరుగులు చేశారు.

వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ 5, గ్యాబ్రియేల్ 3, వారికన్ 2 వికెట్లు తీశారు. హోల్డర్ 56 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ మరిన్ని పరుగులు చేయలేకపోయింది.

ఆట అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ మూడు రోజుల్లోనే ఆట ముగించాలనే ప్లాన్ తమకు ముందు లేదని స్పష్టం చేశాడు. అయితే బంతితో ప్రత్యర్ధిని ఎలా ఒత్తిడికి గురిచేయవచ్చో తెలుసుకున్నామని తెలిపాడు. వికెట్లు తీయగలిగే ఎక్కువ మంది బౌలర్లు జట్టులో ఉండటం గొప్ప విషయమంటూ బౌలర్లపై ప్రశంసలు కురిపించారు. శార్దూల్ ఠాకూర్ గొప్పగా ఆడుతున్నాడని కీర్తించాడు. యువ ఆటగాళ్లపై కూడా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. రిషబ్ పంత్ భయమే లేకుండా చెలరేగి ఆడాడని చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ నెగ్గిన పృధ్వీ షా‌ గొప్పగా ఆడాడని కోహ్లీ అభినందించాడు. మ్యాచ్ ఎక్కడ ఆడినా తొలి సిరీస్‌లోనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ నెగ్గడం గొప్ప విషయమని కోహ్లీ కీర్తించాడు. రానున్న ఆస్ట్రేలియా టెస్ట్ టూర్‌లో ఉమేశ్ మెరుపులు మెరిపిస్తాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండో టెస్ట్‌లో ఎక్కువ వికెట్లు తీసినందుకు ఉమేశ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*