110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన విండీస్‌.. విరుచుకుపడుతోన్న భారత బౌలర్లు

హైదరాబాద్: భారత్‌- వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌ మూడోరోజు  వెస్టిండీస్ తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే తడబడింది. బ్రాత్‌వైట్, పోవెల్ డకౌట్ అయ్యారు. హోప్ 28, హెట్‌మైర్ 17 పరుగులు చేసి అవుటయ్యారు.110 పరుగులకే వెస్టిండీస్ కీలకమైన 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.

వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో చేజ్ 106 పరుగులు చేశాడు. హోల్డర్ 52, బ్రాత్‌వైట్ 14, పోవెల్ 22, హోప్ 36, డౌరిచ్ 30 పరుగులు చేశారు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ 88 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ 4, పృధ్వీ షా 70, పుజారా 10, విరాట్ కోహ్లీ 45, రహానే 80, పంత్ 92, అశ్విన్ 35, కుల్దీప్ యాదవ్ 6 పరుగులు చేశారు.

వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ 5, గ్యాబ్రియేల్ 3, వారికన్ 2 వికెట్లు తీశారు. హోల్డర్ 56 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ మరిన్ని పరుగులు చేయలేకపోయింది.

మరోవైపు మహ్మద్ సిరాజ్‌, హనుమ విహారిని విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేశారు. మనీశ్ పాండేను, శుభ్‌మన్ గిల్‌ను సబ్‌స్టిట్యూట్స్‌గా తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*