పవన్‌ వ్యాఖ్యలపై ఆళ్ల నాని అభ్యంతరం

ఏలూరు: జనసేన ధవళేశ్వరం కవాతు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై వైసీపీ నేత ఆళ్ల నాని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన పవన్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండకట్టకుండా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. జగన్‌పై ఎటువంటి కేసులు లేకున్నా… ఫ్యాక్షనిస్ట్ అంటూ పవన్ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.

బహిరంగ సభలలో పవన్ వాడే బాష సరిగా లేదని నాని విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు తమ పదవులు త్యాగాలు చేశారని నాని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ చేసింది ఏమి లేదన్నారు. ఎక్కడ జగన్‌కు పేరు వస్తుందోనని చంద్రబాబు, పవన్ కలసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబుతో కుమ్మక్కైన పవన్, తమ పార్టీ అధినేతపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాని హెచ్చరించారు.

బహిరంగసభల్లో పవన్ తరచూ జగన్‌పై ఉన్నకేసులను ప్రస్తావిస్తూ అవినీతి ఆరోపణలు గుప్పిస్తుండగా జగన్ తన పాదయాత్రలో పవన్‌ తీరును ఎండగడ్తున్నారు. పవన్ చంద్రబాబుతో మిలాఖాత్ అయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ముగ్గురు భార్యలున్న పవన్ తనపై విమర్శలు చేయడమా అని జగన్ మండిపడ్తున్నారు. అయితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని పవన్ సూచిస్తున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*