పండుగ వేళ విషాదం… భక్తులపైకి రైలు దూసుకెళ్లి 50 మంది మృతి

అమృత్‌సర్: దేశమంతా దసరా పండుగ జరుపుకుంటోన్న వేళ విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ అమృత్‌సర్‌ సమీపంలోని చౌరాబజార్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  ట్రాక్ మీద నిలబడ్డ జనం పైకి రైలు దూసుకెళ్లింది. ఘటనలో 50 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు ట్రాక్‌పైకి వచ్చారు. ఆ సమయంలోనే డీఎమ్‌యూ రైలు(74943) రైలు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా, టపాసుల శబ్దాలతో రైలు వస్తున్న విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అదే సమయంలో ట్రాక్ పైకి జనాన్ని రాకుండా నియంత్రించడంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు విఫలమయ్యారు.

ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

కేంద్ర హోం కార్యదర్శి, పంజాబ్ డీజీపీలతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. కేంద్రం అన్ని విధాలా సహకారమందిస్తుదని హామీ ఇచ్చారు.

ఘటన జరిగినప్పుడు అక్కడ 700మందికి పైగా భక్తులున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*