తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. మొత్తం 38 మంది అభ్యర్ధుల పేర్లను కేంద్ర మంత్రి జేపీ నద్దా ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. అంబర్‌పేట్ నుంచి జి.కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, గోషామహల్ నుంచి టి.రాజాసింగ్, మల్కాజ్‌గిరి నుంచి ఎన్ రామచంద్రరావు(ఎమ్మెల్సీ) ఎల్‌బీనగర్ నుంచి పేరాల శేఖర్ రావు పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆందోల్ నుంచి బాబూ మోహన్, దుబ్బాక నుంచి రఘునందన్‌రావు పోటీ చేస్తారని నద్దా తెలిపారు.

తెలంగాణలో 38 మంది అభ్యర్ధులతో భాజపా తొలి జాబితా

1) ముషీరాబాద్: డా. లక్ష్మణ్

2) అంబర్ పేట: కిషన్ రెడ్డి

3) ఉప్పల్: ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

4) ఖైరతాబాద్: చింతల రామచంద్రారెడ్డి

5) మునుగోడు: మనోహర్ రెడ్డి.

6) కల్వకుర్తి: ఆచారి

7) బోధ్ – మాడవి రాజు

8) బెల్లం పల్లి – ఇమ్మాజి

9) సూర్యాపేట్: వెంకటేశ్వర్ రావ్

10) మేడ్చల్: మోహన్ రెడ్డి

11) ఆదిలాబాద్: పాయల్ శంకర్

12) షాద్ నగర్: శ్రీవర్ధన్ రెడ్డి

13) దుబ్బాక: రఘునందన్ రావ్

14) కరీంనగర్: బండిసంజయ్

15) పెద్దపల్లి: రామకృష్ణ రెడ్డి

16) భూపాల్ పల్లి: కీర్తి రెడ్డి

17) ముదోల్: రమాదేవి

18) నారాయణ్ పేట్: రతన్ పాండు రంగారెడ్డి

19) నిజామాబాద్ అర్బన్: యెండల లక్ష్మీనారాయణ

20) ఎల్.బి.నగర్: పేరాల చంద్రశేఖర్ రావ్

21) పినపాక – సంతోష్ కుమర్ చంద

22) మత్కల్: కొండయ్య

23) ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి

24) ధర్మపురి – అంజయ్య

25) మనకొండురు – గడ్డం నాగరాజు

26) పరకాల: విజయ చంద్ర రెడ్డి

27) మల్కాజ్ గిరి: రామచంద్రరావు

28) పాలేరు: శ్రీధర్ రెడ్డి

29) నిజామాబాద్ రూరల్: కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి

30) తాండూరు: పటేల్ రవిశంకర్

31) అచ్చంపేట: మల్లేశ్వర్

32) సత్తుపల్లి – నంబూరి రామలింగేశ్వర రావు

33) భద్రాచలం: కుంజా సత్యవతి

34) గోషామహల్: రాజాసింగ్

35) కోరుట్ల – జే వెంకట్

36 అందో ల్ – బాబు మోహన్

37 ) కర్వాన్ – అమర్ సింగ్

38 గద్వాల – గద్వాల్ వెంకటాద్రి రెడ్డి

అంతకు ముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర మంత్రి జేపీ నద్దా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులు హాజరయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*