3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షలకు పైగా షేర్ సాధించిన  ‘పందెంకోడి 2’

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలై సూపర్ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్ హిట్ సాధించింది.

‘అభిమన్యుడు’ తర్వాత తెలుగులో మాస్ హీరో విశాల్‌కి మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘పందెంకోడి 2’. ట్రెమండస్ ఓపెనింగ్స్‌తో అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 6 కోట్ల రూపాయలకు కొంటే 3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షల 33 వేల 402 రూపాయల షేర్ సాధించి స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ‘పందెంకోడి’తో పెద్ద హిట్ సాధించిన విశాల్‌కి ఇప్పుడు ‘పందెంకోడి 2’ మరో సూపర్‌హిట్ చిత్రం అయింది.

‘పందెంకోడి 2’ ఘనవిజయానికి కారకులైన ప్రేక్షకులకు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన విశాల్‌కు, లింగుస్వామికి, కీర్తి సురేష్‌కి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు థాంక్స్ చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 రోజులకు ‘పందెంకోడి 2’ కలెక్షన్స్
ఇలా ఉన్నాయి:
వైజాగ్ 57,16,358
ఈస్ట్ గోదావరి 25,62,668
వెస్ట్ గోదావరి 24,79,924
గుంటూరు 44,97,002
కృష్ణా 30,98,435
నెల్లూరు 15,59,048
సీడెడ్ 91,83,024
బళ్ళారి 15,00,000
నైజాం 1,15,36,943

టోటల్ షేర్ 4,21,33,402

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*