నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటు రావడంతో ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. ఆయన కుమారుడు, కుమార్తె విదేశాల నుంచి వచ్చే వరకూ ప్రసాద్ భౌతికకాయాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురిలోనే ఉంచుతారు.

ప్రసాద్ అకాల మరణంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. 75 సంవత్సరాల ప్రసాద్‌కు భార్య విద్యావతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొర్లాం పార్వతీ వర ప్రసాద్ అసలు పేరు అయినా విశాఖపట్నం గోపాలపట్నం స్వస్థలం కావడంతో అంతా ఆయన్ను వైజాగ్ ప్రసాద్ అని పిలిచేవారు.

గౌరి, నీరాజనం, అల్లరి బుల్లోడు, అత్తారింటికి దారేది, నువ్వు నేను, భద్ర తదితర సినిమాల్లో ప్రసాద్ నటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*