హిజ్రాను ప్రేమించాడు… పెళ్లి చేసుకుంటానంటూ గొంతుకోశాడు..

గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురానికి చెందిన రాధిక అనే హిజ్రాను అదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా ప్రేమించాడు. అంతేకాదు. సహజీవనం చేస్తూ ఒకే చోట నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి డబ్బులపై ఆశతో రాధికను హత్య చేయడానికి ప్రయత్నించాడు.

గార్ల మండలం అంజనపురం గ్రామానికి చెందిన రాధిక (హిజ్రా) రెండు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ పట్టణానికి వచ్చి ఒక కిరాయి గృహంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ధరావత్ సురేష్ అనే వ్యక్తి పరిచయమై రాధికను ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

సురేశ్ రెండు సంవత్సరాల నుంచి రాధికతో ఉంటున్నాడు. రాధికకు చిట్టి డబ్బులు రెండు లక్షలు వచ్చాయని తెలుసుకున్నాడు. నిన్న రాత్రి రాధిక వద్దకు వచ్చాడు. రాధికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొత్త బైక్ కొనాలని ఉందని, అందుకోసం డబ్బులు ఇవ్వమని రాధికను అడిగాడు. రాధిక అంగీకరించకపోవడంతో మద్యం మత్తులో ఉన్న సురేశ్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. రాధికను కత్తితో గొంతు కోశాడు. ఇంతలో రాధిక కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. తీవ్ర గాయాలపాలైన రాధికను ఆసుపత్రికి తరలించారు. రాధిక కోలుకుంటోంది.

మరోవైపు సురేశ్‌కు రాధిక గతంలోనే మూడు లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. రైళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన డబ్బులు ఎక్కడ దాచి పెడుతున్నావంటూ సురేశ్ అనేకసార్లు తనను కొట్టినట్లు రాధిక తన తోటి హిజ్రాలతో గతంలోనే చెప్పింది. దీంతో వారు ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చారు. అయితే ఇంతలోనే డబ్బు కోసం సురేశ్ ఇంత దారుణానికి ఒడికడతాడని తాము అనుకోలేదని హిజ్రాలు వాపోతున్నారు. మహబూబాబాద్ సీఐ రవికుమార్‌ను టౌన్ పోలీస్ స్టేషన్‌లో కలిసి కంప్లైంట్ ఇచ్చారు. సురేశ్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*