
వైజాగ్: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై వెయిటర్ శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. ఘటనలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. కోడిపందాలకు ఉపయోగించే కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు.
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చాక శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 160 సీట్లు వస్తాయా సార్ అంటూ జగన్‌ను శ్రీనివాస్ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడి చేశాడు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌కు పయనమయ్యారు.
జగన్‌పై దాడితో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా వైసీీపీ కార్యకర్తలు షాక్‌లో ఉన్నారు.
ఘటనపై విచారణ జరుగుతోంది. శ్రీనివాసరావు ఎందుకు దాడి చేశాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Be the first to comment