
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా నిజం మాత్రం మారదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ జగన్ ఎన్ని కత్తి కోడి డ్రామాలు ఆడినా నిజం మారదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఏ1 ముద్దాయి అయిన జగన్ ఇంకా… దొంగ, దొంగ అని అరుస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో, అవినీతి పునాదులపై పెట్టుకున్న చానల్, పేపర్లలో ఎంత డబ్బా కొట్టుకున్నా కోడి కత్తి డ్రామా వెనక ఉన్న నిజం మారిపోదన్నారు.
Tracking and resolving every grievance is our priority. As part of this, we request you to provide your contact number & the details of your village/mandal/constituency for quick resolution & feedback purposes.
— Lokesh Nara (@naralokesh) April 25, 2018
కుట్రలను బయటపెట్టే వారిపై వైసీపీ నేతలు అంతెత్తున లేస్తున్నారని, మీ అంతు చూస్తానంటూ భయపెడుతున్నారని, ఏకంగా పోలీసులనే బెదిరించే స్థాయికి దిగిజారారని ఆరోపించారు. అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై తనకు నమ్మకం లేదన్న జగన్ రాష్ట్ర ప్రజలను కించపరిచారని పేర్కొన్నారు. జగన్ చాలా దారుణంగా మాట్లాడారని లోకేశ్ విమర్శించారు.
అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఏ1 ముద్దాయి జగన్ మోడీ రెడ్డి దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్ లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు.
— Lokesh Nara (@naralokesh) October 27, 2018
Be the first to comment