రాహుల్‌తో డీఎస్ భేటీ… టీఆర్ఎస్‌కు గుడ్‌బైై!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీ.శ్రీనివాస్ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై చర్చించారు. టీఆర్ఎస్‌లో తనకు వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పుడే డీఎస్ పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. రాహుల్‌తో భేటీ కూడా కావడంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సమర్థుడిగా పేరుతెచ్చుకున్నారు.

డీఎస్ కుమారుడు అరవింద్ ఇటీవలే బీజేపీలో చేరి చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో టీఆర్ఎస్ డీఎస్‌పై భగ్గుమంది. కుమారుడిని ప్రతిపక్ష బీజేపీలో చేర్పించి టీఆర్ఎస్‌ను దెబ్బ తీసేందుకు డీఎస్ యత్నించారనే నిర్ధారణకు వచ్చి ఆయన్ను నేడో, రేపో తొలగించాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో డీఎస్ రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు నేడు టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములునాయక్, నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*